అతిపెద్ద మైనింగ్ ఎక్స్‌పోకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి బృందం

అమెరికాలో పలువురు అధికారులతోనూ సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మైనింగ్‌ రంగంలో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు.

Advertisement
Update:2024-09-25 11:38 IST

అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్షన్ సెంటర్  లో ఏర్పాటు చేసిన మైనింగ్‌ ఎక్స్‌పోను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బృందం హాజరైంది. 120 దేశాల నుంచి 2000 వేల దేశాలకు పైగా ఆధునిక యంత్ర తయారీ సంస్థలు పాల్గొన్న ఈ ప్రదర్శనను భట్టితో పాటు ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌, ఆర్థిక, ప్రణాళిక ప్రత్యేక కార్యదర్శి కృష్ణ భాస్కర్‌, సింగరేణి సీఎండీ బలరాం తిలకించారు.

క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలో అన్వేషణ, అవకాశాలు, విస్తరణపై దృష్టి సారించిన భట్టి విక్రమార్క బృందంతో కలిసి అత్యాధునిక భారీ మైనింగ్‌ ఉత్పత్తి యంత్రాలు, మైనింగ్‌లో ఆధునిక, సాంకేతిక వినియోగంపై అధ్యయనం చేయనున్నారు. మైనింగ్స్‌ ఎక్స్‌పో సందర్శన సందర్బంగా భట్టి బృందం మైనింగ్‌ రంగంలో ప్రముఖ సంస్థలైన కొమాస్టుకాంటోనా, క్యాటర్‌పిల్లర్ ఇంక్, బీకేటీ టైర్స్‌ ఉత్పత్తి సంస్థల ఉత్పత్తులను పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అమెరికాలో పలువురు అధికారులతోనూ సమావేశమైన డిప్యూటీ సీఎం మైనింగ్‌ రంగంలో తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించారు. 

Tags:    
Advertisement

Similar News