కేసీఆర్ బీహార్ పర్యటన.. అసలు కారణం ఏంటంటే..?

తాజాగా బీహార్ పరిణామాలు బీజేపీకి షాకివ్వడంతో.. యాంటీ బీజేపీ ఫ్రంట్ నేతలకు ఇదో మంచి పరిణామంగా తోచింది. నేరుగా కేసీఆర్ పాట్నా వెళ్లి సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వీని కలిసి శుభాకాంక్షలు తెలపబోతున్నారు.

Advertisement
Update:2022-08-10 16:38 IST

బీహార్ రాజకీయ పరిణామాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అందులోనూ కేంద్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమిని సిద్ధం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ పరిణామాలతో మరింత దూకుడు ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తేజస్వీ యాదవ్ తో జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్ ఓ దఫా భేటీ అయ్యారు. తాజాగా మరోసారి తేజస్వి యాదవ్ తోపాటు, బీహార్ సీఎం నితీష్ ని కూడా కలిసేందుకు కేసీఆర్ పాట్నా పర్యటన ఖరారు చేసుకున్నారని తెలుస్తోంది.

యాంటీ బీజేపీ ఫ్రంట్ కి ఉత్సాహం..

కాంగ్రెస్ కలిసి వచ్చినా రాకపోయినా, యాంటీ బీజేపీ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ సహా మరి కొంతమంది నేతలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఇదే విషయంపై కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతల్ని తరచూ కలుస్తున్నారు, కీలక చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో తేజస్వీ యాదవ్‌ హైదరాబాద్‌ వచ్చి ప్రగతిభవన్‌ లో సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి దిశగా తాను చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్‌ ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌ కి వివరించారు. ఆ తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన, ఉద్ధవ్ ఠాక్రేతో కీలక భేటీ అందరికీ తెలిసిందే. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తాజాగా బీహార్ పరిణామాలు బీజేపీకి షాకివ్వడంతో.. యాంటీ బీజేపీ ఫ్రంట్ నేతలకు ఇదో మంచి పరిణామంగా తోచింది. నేరుగా కేసీఆర్ పాట్నా వెళ్లి సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వీని కలిసి శుభాకాంక్షలు తెలపబోతున్నారు.

సైనిక కుటుంబాలకు సాయం..

2020 జూన్‌ లో గల్వాన్‌ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. బీహార్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ ఆ రాష్ట్ర సైనికుల కుటుంబాలను స్వయంగా కలిసి చెక్కులు అందజేస్తారని తెలుస్తోంది. బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్‌ బీహార్‌ పర్యటన అనంతరం మరింత జోష్ తో జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెడతారని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News