తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు.. కోమటిరెడ్డిని ఉద్దేశించేనా?

నల్ల‌గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు గట్టి పోటీ ఇచ్చారు.

Advertisement
Update:2024-08-25 22:34 IST

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న వ్యవహారశైలి, ఆయన చేస్తున్న కామెంట్స్‌ ఇదే విషయాన్ని బలపరుస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు రెడ్డి నేతలు కుట్రలు చేశారని ఆరోపించారు మల్లన్న. కౌంటింగ్ రోజు విదేశాల నుంచి ఓ మంత్రి ఫోన్ చేసి మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా, లేదా అని ఆరా తీశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకులకు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తానని, వడ్డీతో సహా చెల్లిస్తానని వార్నింగ్ కూడా ఇచ్చారు మల్లన్న.

అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించే మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. దీంతో మల్లన్న ఆయనను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్ల‌గొండ - ఖమ్మం - వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక హోరాహోరీగా జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్నకు గట్టి పోటీ ఇచ్చారు.

ఇక కొద్దిరోజులుగా బీసీ వాదం వినిపిస్తున్నారు మల్లన్న. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పదవుల విషయంలో రెడ్డి సామాజికవర్గం నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్‌లోనూ ఈ అంశంపై చర్చించారు. ఇక అడ్వకేట్ జనరల్ పదవిని బీసీలకు ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని సీఎం రేవంత్ కొట్టిపారేశారంటూ ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మల్లన్న మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News