ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..వెనక్కి తగ్గిన హైడ్రా

ప్రజల్లో తీవ్ర నిరసన.. నిన్న కూకట్ పల్లిలో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడంతో హైడ్రా ఇవాళ్టి కూల్చివేతల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Update:2024-09-28 13:34 IST

ప్రజల్లో వ్యతిరేకత.. నిన్న కూకట్ పల్లిలో బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకోవడంతో హైడ్రా ఇవాళ్టి కూల్చివేతల కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోనూ సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున నిరసలు రావడంతో వెనక్కి వెళ్లిపోయారు. మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్‌ చేసేందుకు వచ్చిన అధికారుల బృందాలకు రెండోరోజు స్దానిక ప్రజలు నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.

బాధితులు అడుగడుగునా అధికారులను అడ్డుకున్నారు. వాగ్వివాదానికి దిగారు. రోడ్లపై బైటాయించి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినదించారు. ఇళ్లకు మార్కింగ్‌ వేయకుండా అధికారులను వెనక్కి పంపించారు. నిర్వాసితులకు కాంగ్రెసేతర అన్ని పక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. చైతన్యపురిలో బాధితుల ఆందోళనలకు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మద్దతు ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News