‘తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ 2023’ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... కేటీఆర్ ట్వీట్

''తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ ను ప్రవేశపెట్టాము. ఇది యువ నిపుణులకు అత్యంత ఔత్సాహిక బృందంతో కలిసి పనిచేయడానికి, మీ కెరీర్‌ల కోసం శాశ్వతమైన నెట్‌వర్క్‌ను రూపొందించుకోవ‌డానికి అవకాశాన్ని అందిస్తుంది.'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement
Update:2023-03-07 12:42 IST

తెలంగాణ లో 2030 నాటికి లైఫ్ సైన్సెస్ పరిశ్రమను 80 బిలియన్ డాలర్ల నుంచి 250 బిలియన్ డాలర్లకు పెంచాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

''తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫెలోషిప్ ను ప్రవేశపెట్టాము. ఇది యువ నిపుణులకు అత్యంత ఔత్సాహిక బృందంతో కలిసి పనిచేయడానికి, మీ కెరీర్‌ల కోసం శాశ్వతమైన నెట్‌వర్క్‌ను రూపొందించడానికి అవకాశాన్ని అందిస్తుంది.'' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ ఫెలోషిప్, విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, మానవ జీవితాల నాణ్యతను అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది.

ఈ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి గల వ్యక్తులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 7, 2023లోపు సమర్పించవలసిందిగా ప్రభుత్వం కోరింది.


Tags:    
Advertisement

Similar News