మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్పీ గట్టి కౌంటర్

సభ్యత, సంస్కారం మానవత్వం అంటే ఎంటో తెలియని మీరు నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదని ఆర్‌ఎస్పీ మంత్రి కొండాకి కౌంటర్ ఇచ్చారు.

Advertisement
Update:2024-11-29 18:58 IST
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్పీ గట్టి కౌంటర్
  • whatsapp icon

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. సభ్యత-సంస్కారం- మానవత్వం అంటే ఎంటో తెలియని మీరు నా గురించి కానీ, పేద గురుకుల విద్యార్థుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదని ఆర్‌ఎస్పీ పేర్కొన్నారు. బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీలు మాత్రమే తెలిసిన మీకు, ఓరుగల్లు నగరంలో ఎంతో మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని ఆర్‌ఎస్పీ ఆరోపించారు. ధమ్ముంటే మీరు గురుకులాల మీద బహిరంగ చర్చకు రాండి, అంతే కాని మత్తులో ఉన్న ఈ మతి స్థిమితం లేని మంత్రులను, భజంత్రీలను పంపించి నవ్వులపాలు కాకండని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకుల హాస్టళ్లలో వరుస కలుషిత ఆహారం ఘటనల వెనుక బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పనిచేశారు. తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారు’’ అని కొండా సురేఖ ఆరోపించిన సంగతి తెలిసిందే 

Tags:    
Advertisement

Similar News