రేవంత్‌ పాలనంతా అప్పులే.. ఒక్క హామీ నెరవేరలే

రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఎదగాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి

Advertisement
Update:2024-11-07 13:23 IST

కాంగ్రెస్‌ పాలనలో ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల కార్యశాలలో పాల్గొన్న కేంద్ర మంత్రి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేవంత్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా బలోపేతమౌతూనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఏడాది పాలనలో కొత్త రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, కొత్త ఇవ్వలేదు. కానీ అప్పులు మాత్రం గణనీయంగా చేశారని ధ్వజమెత్తారు. మహిళ, యువత, రైతుల సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దివాలా తీశాయని చెప్పారు. 11 నెలల్లోనే ఈ ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు బీజేపీలో 32 లక్షల సభ్యత్వం నమోదైందన్నారు. గ్రామీణ ప్రాంతంలో బీజేపీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. కుటుంబాల ఆధారంగా దేశంలో అనేక పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్యకర్తల ఆధారంగా నడిచేపార్టీ బీజేపీ ఒక్కటేనని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీ ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తీర్పు ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు కి షన్‌ రెడ్డి సూచించారు. కార్యశాలలో సునీల్‌ బన్సల్‌, ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, పార్టీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News