రేవంత్‌ రెడ్డి దేశంలోనే తుగ్లక్‌ సీఎం

చెప్పకుండా ఎంపీ అనిల్‌ హాస్పిటల్‌ కు వెళ్లి డ్రగ్స్‌ టెస్ట్‌ కు రమ్మంటున్నడు.. టెస్ట్‌ కు మేం రెడీ అని ముందే చెప్పిన : ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి

Advertisement
Update:2024-10-30 12:44 IST

రేవంత్‌ రెడ్డి దేశంలోనే తుగ్లక్‌ సీఎం అని.. ఆయనకు గొప్ప అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు. ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాల్‌ ను తాము స్వీకరించామన్నారు. ఆయన ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్‌ కు వెళ్లి డ్రగ్స్‌ టెస్ట్‌ కు రమ్మంటున్నారని తెలిపారు. తాము ఏ టెస్ట్‌ కైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. తనకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో పంచాయితీ లేదని.. రేవంత్‌ రెడ్డితోనే పంచాయితీ అన్నారు. తనకు అనిల్‌ మంచి మిత్రుడని.. ఆయన వార్డు మెంబర్‌ గా గెలవడని తాను తిట్టవచ్చన్నారు. డ్రగ్స్‌ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరగలేదని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తో ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పించాలని సవాల్‌ విసిరారు. సీఎం రేవంత్‌ రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో డ్రగ్స్‌ టెస్ట్‌ కు రావాలని సవాల్‌ చేశారు. డ్రగ్స్‌ శాంపిల్స్‌ ఇవ్వడానికి తాము డబ్బాలు పట్టుకొని రెడీగా ఉన్నామని, ఇంతవరకు తమను పిలువలేదన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేకనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అన్నారు. డ్రగ్స్‌ గురించి సీఎం చిత్తశుద్ధితో మాట్లాడితే మంచిదన్నారు. తనను డ్రాప్‌ చేయాలని చూసినట్టే డ్రగ్స్‌ కేసులో రాజ్‌ పాకాల కుటుంబాన్ని ఇరికించాలని చూశారని తెలిపారు. కేసీఆర్‌ పేరు ఎత్తకుండా రేవంత్‌ ఒక్క మీటింగ్‌ అయినా పూర్తి చేశాడా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ పేరు తుడిచేస్తే చెరిగిపోయేది కాదన్నారు. రైతుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేశారని, 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. 

Tags:    
Advertisement

Similar News