తెలంగాణ ప్రజల‌కు చల్లని వార్త‌.. ఈ నెల16 తర్వాత వర్షాలు!

చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Advertisement
Update:2023-03-12 08:26 IST

కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ దంచి కొడుతోంది. ఉష్ణొగ్రతలు కొన్ని చోట్ల 35 డిగ్రీల సెల్సీయెస్ ను దాటి పోయాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అయితే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త వినిపించింది. ఈ నెల 16 తర్వాత తెలంగాణలో వర్షాలు పడనున్నాయి.

చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించింది. దీనికి తోడు తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణలోకి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయి. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

రాష్ట్రంలో నిన్నటి నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి.హైదరాబాద్‌లో నిన్న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది 2.6 డిగ్రీలు తక్కువ. ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అలాగే, ఈ నెల 16 తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News