ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పీఆర్సీ కమిటీ నియామకం
పీఆర్సీ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ ని, కమిటీ సభ్యునిగా మరో రిటైర్డ్ అధికారి బి.రామయ్యను నియమిస్తూ కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇది గుడ్ న్యూస్. గాంధీ జయంతి రోజున ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ కమిటీ నియమించారు. కమిటీ కాలయాపన చేయకుండా 6 నెలల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశాలిచ్చారు.
ఉద్యోగ వర్గాల్లో సంబరాలు..
5 శాతం ఐఆర్ ప్రకటించడంతోపాటు, పీఆర్సీ ప్రకటన కూడా వెలువడటంతో ఉద్యోగ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పీఆర్సీ కమిటీ ప్రకటన వెలువడే అవకాశం లేదు. నోటిఫికేషన్ రేపో మాపో అనుకుంటున్న టైమ్ లో పీఆర్సీ కమిటీ ప్రకటన విడుదల కావడంతో ఉద్యోగులు ఫుల్ ఖుషీ అయిపోయారు.
పీఆర్సీ కమిటీ చైర్మన్ గా శివశంకర్..
పీఆర్సీ కమిటీ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ ని, కమిటీ సభ్యునిగా మరో రిటైర్డ్ అధికారి బి.రామయ్యను నియమిస్తూ కాసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు సీఎస్.