గ్రూప్‌-3, గ్రూప్‌-2 వాయిదా వేయండి.. సీఎం రేవంత్‌కు ఎస్సీ విద్యార్థుల లేఖ

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగే వరకు గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలను వాయిదా వేసి న్యాయం చేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

Advertisement
Update:2024-10-22 21:21 IST

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలయ్యేంత వరుకు గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలను వాయిదా వేయాలని ఎస్సీ సామాజిక విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు ఉపకులాలకు దక్కేలా చేయాలని..వర్గీకరణ అమలు తర్వాత పరీక్షలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు1న ఏడుగురు సభ్యులు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని.. త్వరలో జరుగబోయే పరీక్షల్లోనూ వర్గీకరణ అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలులో న్యాయపరమైన చిక్కులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆక్టోబర్12న జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీవో జారీ చేసిందన్నారు.

Tags:    
Advertisement

Similar News