శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ఘనత ఇది
ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని చెప్పారు డీజీపీ అంజనీ కుమార్. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పారు డీజీపీ అంజనీ కుమార్. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషామహల్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో డీజీపీ పాల్గొన్నారు. పలువురు ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పోలీస్ అమరవీరుల సేవలను వారు గుర్తు చేసుకున్నారు. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడతామని చెప్పారు.
పోలీసు అమరవీరుల దినోత్సవానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేశారు. అదే సమయంలో తెలంగాణలో పోలీసు డిపార్ట్ మెంట్ మెరుగైన పనితీరు కలిగి ఉందన్నారు. భరోసా కేంద్రాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని డీజీపీ చెప్పారు డీజీపీ. దేశంలో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణలో క్రైమ్ రేటు తగ్గుతూ వస్తోందన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వీరులకు వందనం..
భారత్, చైనా సరిహద్దుల్లో 1959 అక్టోబర్ 21న.. 10 మంది సీఆర్ఫీఎఫ్ పోలీసులు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించారని.. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాదీ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటామని చెప్పారు డీజీపీ అంజనీ కుమార్. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారని చెప్పారు. వారందరికీ సగర్వంగా వందనం చేస్తున్నట్లు తెలిపారు డీజీపీ. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు.
♦