ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించండి

గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మకు మంత్రి సీతక్క విజ్ఞప్తి

Advertisement
Update:2024-09-24 11:51 IST

ములుగు మున్సిపాలిటీ బిల్లును ఆమోదించాలంటూ మంత్రి సీతక్క గవర్నర్‌ను కోరారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మను మంత్రి కలిశారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లుకు త్వరగా ఆమోదం తెలుపాలని కోరారు.అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. 2022లో నాటి ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా చేస్తూ బిల్‌ పెట్టింది. ములుగుకు మున్సిపాలిటీ హోదా ఇచ్చే బిల్లు  గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నది. దీనిపై మేం ఆరా తీస్తే ఈ బిల్లు గవర్నర్‌ నుంచి రాష్ట్రపతి వద్దకు వెళ్లిందని తెలిసిందన్నారు. ములుగును మున్సిపాలిటీ చేస్తూ పంపిన ఆ బిల్లును తొందరగా ఆమోదించాలని కోరాను. తన విజ్ఞప్తికి గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. తొందరలోనే దీన్ని పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. ములుగు జిల్లాల్లోని గ్రామాలను గవర్నర్‌ దత్తత తీసుకునే యోచనలో ఉన్నారని చెప్పారు.

అలాగే ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన సంఘటలపై గవర్నర్‌ అడిగారు. అక్కడ శాంతియుత వాతావరణాన్ని తీసుకురావడానికి కృషి చేస్తూనే.. అక్కడున్న ఆదివాసీ ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి త్వరలో ఆదిలాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనకు గవర్నర్‌ సిద్ధంగా ఉన్నారన్నారు.

Tags:    
Advertisement

Similar News