హైదరాబాద్‌లో స్తంభించిన మెట్రో
హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలుచోట్ల మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపమే కారణంగా రైల్లు నిలిచినట్లు అధికారులు తెలిపారు.
Advertisement
హైదరాబాద్ మెట్రో రైళ్లలో సాంకేతిక లోపంతో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నాగోల్ – రాయదుర్గం, ఎల్‌బీనగర్ – మియాపూర్ మార్గంలో ఎక్కడిక్కడ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం సమయంలో ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రో ఎక్కిన ఉద్యోగులు రైళ్లు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పలుమార్గాల్లో ఆలస్యంగా నడుతుస్తున్నట్లు సమాచారం. విద్యుత్ ఫీచర్ ఛానల్‌లోసాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని మెట్రో అధికారులు వివరించారు. మరో వైపు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు స్టేషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు.
Advertisement