ఈసీ సూచన ప్రకారం కొత్త పోస్టింగ్ లు ఖరారు

4 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు, హైదరాబాద్, వరంగల్‌, నిజమాబాద్‌ కు కొత్త పోలీస్ కమిషనర్ల నియామకం జరిగింది. యాదాద్రి క‌లెక్ట‌ర్‌ గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌ గా ఆశిష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌ గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌ గా గౌతమ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Update:2023-10-13 17:18 IST

తెలంగాణలో 20మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని విధుల నుంచి దూరం పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఆ స్థానంలో కొంత మందిని సిఫారసు చేసింది. మొత్తం 20 స్థానాలకు కొత్త జాబితా నుంచి పేర్లను సూచించింది ఈసీ. ఈసీ సూచన ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఆయా స్థానాల్లో కొత్తవారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

4 జిల్లాలకు కొత్త కలెక్టర్లు, 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు, హైదరాబాద్, వరంగల్‌, నిజమాబాద్‌ కు కొత్త పోలీస్ కమిషనర్ల నియామకం జరిగింది. యాదాద్రి క‌లెక్ట‌ర్‌ గా హ‌నుమంత్, నిర్మ‌ల్ క‌లెక్ట‌ర్‌ గా ఆశిష్ సంగ్వాన్, రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌ గా భార‌తీ హోలీకేరి, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్‌ గా గౌతమ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ర‌వాణా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిగా వాణీ ప్ర‌సాద్, ఎక్సైజ్-వాణిజ్య ప‌న్నుల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శిగా సునీల్ శ‌ర్మ‌, ఎక్సైజ్ క‌మిష‌న‌ర్‌ గా జ్యోతి బుద్ధ ప్ర‌కాశ్‌, వాణిజ్య ప‌న్నుల శాఖ క‌మిష‌న‌ర్‌ గా క్రిస్టినాని నియమించారు. వరంగల్ పోలీస్ కమిషనర్‌ గా అంబర్ కిషోర్ ఝా , నిజామాబాద్‌ పోలీస్ కమిషనర్‌ గా క‌ల్మేశ్వ‌ర్‌ ని ఎంపిక చేశారు.

సీవీ ఆనంద్ స్థానంలో సందీప్ శాండిల్య..

హైదరాబాద్‌ కొత్త సీపీగా సందీప్‌ శాండిల్యను నియమిస్తూ తెలంగాణ సీఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సందీప్‌ శాండిల్య రేపు(శనివారం) బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో ఆయన సైబరాబాద్‌ సీపీగా పనిచేశారు. 

10 జిల్లాలకు కొత్త ఎస్పీలు వీరే..

సంగారెడ్డి - చెన్నూరి రూపేష్

కామారెడ్డి - సింధు శర్మ

జగిత్యాల - సన్‌ ప్రీత్ సింగ్

మహబూబ్ నగర్ - హర్షవర్ధన్

నాగర్ కర్నూల్ - గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

జోగులాంబ గద్వాల్ - రితిరాజ్

మహబూబాబాద్ - డాక్టర్ పాటిల్ సంగ్రామ్

నారాయణపేట - యోగేష్ గౌతమ్

జయశంకర్ భూపాలపల్లి - కిరణ్ ప్రభాకర్

సూర్యాపేట- బీకే.రాహుల్ హెడ్గే

కొత్తగా బాధ్యతలు చేపట్టినవారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇప్పుడిక వారి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారో వేచి చూడాలి. ఆ భర్తీ విషయంలో కూడా ఈసీ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.


Tags:    
Advertisement

Similar News