ప్రతిపక్షాల ఊహలకు అందని విధంగా బీఆర్ఎస్ మేనిఫెస్టో..
తెలంగాణలోని పథకాలు దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్ ను చూసి బీజేపీ నేర్చుకుంటోందని తెలిపారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టో చూసి కాంగ్రెస్, బీజేపీకి దిమ్మ తిరిగిపోయిందని అన్నారు ఎమ్మెల్సీ కవిత. తమ మేనిఫెస్టో ఈ స్థాయిలో ఉంటుందని విపక్షాలు ఊహించలేదని చెప్పారామె. అన్నివర్గాలను సమానంగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశం అని చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు కవిత.
మేనిఫెస్టోతో అన్ని వర్గాల్లో సంతోషం..
బీఆర్ఎస్ మేనిఫెస్టోతో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని చెప్పారు కవిత. అన్నివర్గాలను దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టో రూపొందిందని చెప్పారు. ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ కూడా ఇలాంటి మేనిఫెస్టో ప్రకటించలేదని, ప్రకటించబోదని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని తామేమీ కాపీ కొట్టలేదని, తమ పథకాలనే కేంద్రంలోని బీజేపీ కాపీకొడుతోందని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కూడా తెలంగాణలో తాము అమలు చేస్తున్న పథకాల నుంచి స్ఫూర్తి పొందినవేనని చెప్పారు కవిత.
తెలంగాణలోని పథకాలు దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్ ను చూసి బీజేపీ నేర్చుకుంటోందని తెలిపారు. తాము అమలుచేస్తున్న పథకాలను ప్రధాని మోదీ సైతం స్ఫూర్తిగా తీసుకుంటున్నారని చెప్పారు.
వాళ్లు మాకు పోటీయే కాదు..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్, బీజేపీ అసలు పోటీయే కాదని తెలిపారు కవిత. బీజేపీ ఈసారి 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు.