ముచ్చటగా మూడోసారి సీఎం సభకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే దొంతి
ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి సభకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి డుమ్మా కొట్టారు.
వరంగల్ నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముచ్చటగా మూడోసారి సీఎం రేవంత్‌రెడ్డి సభకు డుమ్మా కొట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా చర్ననీయాంశమైంది. హన్మకొండ పట్టణంలోనిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రజా విజయోత్ససభకు ఆయన దూరంగా ఉన్నారు. దొంతి మాధవ రెడ్డి ఇంటి సమీపంలోనే ప్రజాపాలన విజయోత్సవ సభ జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఏ మాత్రం సంబంధం లేనట్లుగానే ఇంటి వద్ద ఉండిపోయారు.
కాగా, గతంలో కూడా రెండు సార్లు వరంగల్‌కు ముఖ్యమంత్రి వచ్చినా, ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చినా వెళ్లలేదు. దీంతో దొంతి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారా పార్టీ మారతారనే చర్చ జోరుగా కొనసాగుతున్నది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్లే సీనియర్ నాయకుడు అయినా దొంతి దూరంగా ఉంటున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నది.