బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చి రెస్టారెంట్లో ఓ వ్యక్తికి బిర్యానిలో ట్యాబ్లెట్లు రాగా వీడియో ఎందుకు తీస్తున్నారని యాజమాన్యం దబాయించారు.

Advertisement
Update:2024-12-06 15:20 IST

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు బావర్చి బిర్యానిలో ట్యాబ్లెట్ల కలకలం రేపింది. తాజాగా ఓ వ్యక్తిక్తికి బిర్యానిలో ట్యాబ్లెట్లు రాగా వీడియో ఎందుకు తీస్తున్నారని యాజమాన్యం దబాయించారు. దీంతో వారు వీడియో తీస్తుండగా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. మొన్న బిర్యానీలో సిగరెట్ పీక దర్శనమిచ్చింది.హైదరాబాద్‌లోని పలు రెస్టారెంట్స్, హోటల్స్‌లో నిత్యం ఇలాంటి ఘటనలు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

కాలం చెల్లిన పదార్థాలను వాడటం, కుళ్లిపోయిన మాంసం వంటివి ఎన్నో సందర్భాల్లో వెలుగులోకొచ్చాయి. ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరుపైనా విమర్శలొస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కస్టమర్ల ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టి, కేసులు బుక్ చేసి, జరిమానాలు విధించి వెళ్లిపోతున్నారే తప్ప వీటికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. అందుకే హోటల్స్ నిర్వాహకులు తనిఖీల తరువాత కూడా మళ్లీ యధావిధిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News