కేటీఆర్ బైక్ నెంబర్ '4444'

"నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను నడిపిన బైక్ అది. 29ఏళ్ల తర్వాత కూడా అదింకా పనిచేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ తీపి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసినందుకు థ్యాంక్యూ జాన్సన్" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Advertisement
Update:2022-11-06 16:31 IST

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలతో సంతోషంగా ఉన్న మంత్రి కేటీఆర్ కి ఓ పాత జ్ఞాపకం మరింత ఆనందాన్నిచ్చింది. ఆయన నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో నడిపిన బైక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, ఆ బైక్ ఇంకా రన్నింగ్ కండిషన్లో ఉండటం విశేషం. ఆ బైక్ ఫొటోలను జాన్సన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయగా కేటీఆర్ రీట్వీట్ చేసి సంబరపడ్డారు.

"నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో నేను నడిపిన బైక్ అది. 29ఏళ్ల తర్వాత కూడా అదింకా పనిచేస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ తీపి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసినందుకు థ్యాంక్యూ జాన్సన్" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


ఆ బైక్ ఇంకా పనిచేస్తోందా..?

గతంలో కేటీఆర్ వాడిన బైక్ పై కూర్చుని దిగిన ఫొటోని జాన్సన్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఉంచారు. కేటీఆర్ ని కూడా ట్యాగ్ చేశారు. '1994 మేజర్ త్రోబ్యాక్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. అంతే కాదు. గతంలో లాగా మీతో కలసి బైక్ రైడ్ చేయాలని ఉందన్నా, వెయిట్ చేయలేకపోతున్నా అంటూ ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు జాన్సన్. దీంతో జాన్సన్ అనే వ్యక్తి కేటీఆర్ కాలేజీ ఫ్రెండ్ అయి ఉంటారని అందుకే అప్పటి రోజుల్లోలాగా మరోసారి బైక్ రైడ్ కి వెళ్దామని అభ్యర్థించి ఉంటారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఏదేమైనా అప్పటి నుంచి ఆ బైక్ ని కేటీఆర్ గుర్తుగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు జాన్సన్. ఆ బైక్ ఇంకా రన్నింగ్ కండిషన్లో ఉండటం విశేషం. 

Tags:    
Advertisement

Similar News