జూబ్లిహిల్స్ అభ్యర్థిని ప్రకటించిన MIM.. ఎవరో తెలుసా.?
ఇంకా బహదూర్‌పురా, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బహదూర్‌పురా నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా MIM మరో అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లిహిల్స్ MIM అభ్యర్థిగా షేక్‌పేట్ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌కు అవకాశమిచ్చింది. దీంతో ఇప్పటివరకూ 7 నియోజకవర్గాలకు MIM అభ్యర్థులు ప్రకటించినట్లయింది. మరో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ సారి మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. చాంద్రాయణగుట్ట, నాంపల్లి, మలక్‌పేట్, యాకుత్‌పురా, చార్మినార్, కార్వాన్, బహదూర్‌పురా, జూబ్లిహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో MIM అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. ఇంకా బహదూర్‌పురా, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బహదూర్‌పురా నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఓవైసీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇక జూబ్లిహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డిని కాదని అజారుద్దీన్‌కు అవకాశమిచ్చింది. ఇక బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న జూబ్లిహిల్స్ బరిలో MIM నిలుస్తుండటంతో హోరాహోరీ పోరు తప్పదన్న ప్రచారం జరుగుతోంది.