మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను నిర్మించింది మెఘా కాదు ఎల్ అండ్ టి
మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయి అనగానే కేసీఆర్ ప్రభుత్వంపైన, మెఘా సంస్థ మీద కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధానంగా నిర్మించింది మెఘా సంస్థ అయినప్పటికీ, కాళేశ్వరం టోటల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇతర చిన్న ప్రాజెక్టులను వేరే సంస్థలు నిర్మించాయి. ఇప్పుడు సమస్య ఏర్పడ్డ మేడిగడ్డ ప్రాజెక్టును ఎల్ అండ్ టి నిర్మించింది.
మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగాయి అనగానే కేసీఆర్ ప్రభుత్వంపైన, మెఘా సంస్థ మీద కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రధానంగా నిర్మించింది మెఘా సంస్థ అయినప్పటికీ, కాళేశ్వరం టోటల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇతర చిన్న ప్రాజెక్టులను వేరే సంస్థలు నిర్మించాయి. ఇప్పుడు సమస్య ఏర్పడ్డ మేడిగడ్డ ప్రాజెక్టును ఎల్ అండ్ టి నిర్మించింది.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజిని నిర్మించారు. గోదావరి నదీ జలాలను.. సాగు, తాగు నీటి కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ లక్ష్మీ బ్యారేజిని నిర్మించారు.
లక్ష్మీ బ్యారేజిని ఎల్ అండ్ టి నిర్మించింది. దీని పొడవు 1.632 కి. మీ. మొత్తం 85 గేట్లు. ఈ బ్యారేజీ నిల్వ సామర్ధ్యం 16.17 వేల మిలియన్ క్యూబిక్ అడుగులు(టిఎంసిలు). గరిష్టంగా 80 వేల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకోగలదు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో లక్ష్మీ బ్యారేజీ ప్రారంభోత్సవం జరిగింది. ప్రాణహిత నది సంగమానికి దిగువన ఎంతో వ్యూహాత్మకంగా ఈ బ్యారేజీని నిర్మించారు.
లక్ష్మీ బ్యారేజీ ప్రాణహిత నది దిగువన ఉంది. గోదావరి నదీ జలాల నుంచి రోజుకు 2 (టిఎంసి)లతో పాటు, అదనంగా మరో టిఎంసి నీటిని లిఫ్ట్ చేసే నిబంధనతో, ప్రతి ఏటా మొత్తం 160 టిఎంసిల నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. నీటిని ఎత్తిపోసేందుకు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, గాయత్రి పంపు హౌసుల్లో ఏర్పాటు చేసిన పంపుల సామర్థ్యం విషయంలో దేనికవే విశిష్టమైనవి.
ఈ పంప్ హౌస్‌లు ఒక్కొక్కటి రోజుకు రెండు టిఎంసిల నీటిని లిఫ్టింగ్ చేసే సామర్థ్యంతో నిర్మించారు. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ వద్ద కొన్ని పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ముఖ్యంగా అక్కడ కాంక్రీట్ నిర్మాణంతో ఉన్న పియర్ కుంగింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆపరేటర్ అయిన ఎల్ ఎండ్ టి(L&T) నిపుణుల కమిటీనీ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని, అక్కడ కాంక్రీట్ నిర్మాణంలో ఉన్న పియర్ కుంగడంతో పెద్ద శబ్థం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే ఈ బ్యారేజీ వద్ద దెబ్బతిన్న స్తంభాలను పునరుద్ధరించడానికి ఎల్ ఎండ్ టి నిపుణుల కమిటీ నివేదికను సమర్పించనుంది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ - లక్ష్మీ బ్యారేజీ ముఖ్యాంశాలు
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీనికి నీటిని ప్రాణహిత, గోదావరి నదుల ద్వారా సమీకరిస్తారు. ప్రాణహిత నది కూడా వార్ధా, పైన్గాంగా, మరియు వెన్గాంగా నదులతో సహా వివిధ చిన్న ఉపనదుల సంగమం, ఇది ఉపఖండంలో ఏడవ అతిపెద్ద నీటి పారుదల బేసిన్గా ఏర్పడుతుంది. ఏడాదికి 280 టిఎంసిల నీటిని డిశ్చార్జ్ చేసే సామర్ధ్యం దీనికి ఉంది.
రాష్ట్రంలోని వేలాది హెక్టార్ల భూములకు సాగునీటిని ఇది అందజేస్తుంది. ఈ బ్యారేజీలో 85 హైడ్రోమెకానికల్ రేడియల్ గేట్లను భారీ కాంక్రీట్ స్తంభాల మధ్య అమర్చారు. నిర్మాణంలో 7 బుర్జ్ ఖలీఫాల నిర్మాణానికి సమానమైన కాంక్రీటును, 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సమానమైన ఉక్కును, 6 పిరమిడ్ల కోసం భూమిని తవ్వారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 13 జిల్లాల ద్వారా సుమారు 500 కి.మీ. దూరం వరకు 7 లింకులు మరియు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. అలాగే 1,800 కి.మీ. కంటే ఎక్కువ కాలువ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుంటుంది. మొత్తం 240 టిఎంసిలు అనగా మెడిగడ్డ బ్యారేజ్ నుండి 195, శ్రీపాద యల్లంపల్లి ప్రాజెక్టు నుండి 20, భూగర్భ జలాల నుండి 25 టిఎంసిల నీటిని తీసుకోవాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది, వీటిలో 169 టిఎంసిలు నీటిపారుదల కోసం, 30 టిఎంసిలు హైదరాబాద్ నగర తాగునీటికి, 16 టిఎంసిలు ఇతర పారిశ్రామిక అవసరాలకు, 10 టిఎంసిలు సమీప గ్రామాల్లో తాగునీటికి, మిగిలినవి ఆవిరి అవుతాయని అంచనా వేశారు. అంతే కాకుండా ప్రాజెక్ట్ మొత్తం సాగు చేయదగిన కమాండ్ ఏరియా అంటే అకౌంటింగ్ తర్వాత నీటిపారుదల చేయగల స్థిరమైన ప్రాంతాన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.