నీ సొంత నియోజకవర్గం ముందు చూసుకో..తర్వాత రాష్ట్రాల పర్యటనలు : ఆర్ఎస్పీ
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర పర్యటనలు ఆపి, కొంచెం ప్రజా సమస్యలపై దృష్టి సారించండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర పర్యటనలు ఆపి, కొంచెం ప్రజా సమస్యలపై దృష్టి సారించండి అంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్టర్ వేదికగా పేర్కొన్నారు. మీ సొంత ఇలాకా కొడంగలే కొలిమిలా మారిందని రాసుకొచ్చారు. మీ అసమర్థత, ప్రతీకారధోరణి, అనాలోచిత నిర్ణయాల వల్ల అధికారుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 19000 ఎకరాలు సేకరించి ఉన్నా, మళ్లీ వేల ఎకరాలు అదనంగా ఫార్మాకు ఎందుకు సేకరించాలన్న సంగతి మీరు తెలంగాణ ప్రజలకు, రైతులకు చెప్పకుండా.. అమాయక అధికారులను ‘మానవ కవచంగా’ వాడుకుంటున్నారని ఆర్ఎస్పీ తెలిపారు ముఖ్యమంత్రి ఎందుకు పేద రైతులతో మాట్లాడలేకపోతున్నారని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ ఎందుకు బాధ్యతరాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు. సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో వేల ఎకరాల మీ భూములను మీరు ప్రజా ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ఇచ్చిండ్రా? ఇవ్వగలరా?వేల ఎకరాలున్న మీకే దాన గుణం లేనప్పుడు, రెక్కాడితే డొక్కాడని భూమినే నమ్ముకున్న పేద బంజారాలు భూమిని ఎట్ల ఇస్తారని అనుకున్నరు? వాళ్లకేమైనా మీ ఫార్మా కంపెనీలో భాగస్వామ్యం ఇస్తరాఅంటే ఇవ్వరు అని ఆర్ఎస్పీ స్పష్టం చేశారు.