మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌నే ద‌స‌రా : కేసీఆర్

తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Advertisement
Update:2024-10-11 20:04 IST

తెలంగాణ ప్రజలకు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌నిషి త‌న‌లోని చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశ‌గా విజ‌యం సాధించాల‌నే జీవ‌న తాత్విక‌త‌ను విజ‌య ద‌శ‌మి మ‌న‌కు తెలియ‌జేస్తుంద‌ని తెలిపారు. విజయ దశమి రోజు శుభ‌సూచ‌కంగా పాల‌పిట్ట‌ను ద‌ర్శించి ష‌మీ వృక్షానికి పూజ చేసి, జ‌మ్మి ఆకును బంగారంలా భావించి పెద్ద‌ల‌కు స‌మ‌ర్పించుకుని వారి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఆచారం.

తెలంగాణ ప్ర‌జ‌ల జీవితాల్లో ద‌స‌రా పండుగ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. అలాయ్ బ‌లాయ్ తీసుకుని ప‌ర‌స్ప‌ర ప్రేమాభిమానాల‌ను పంచుకోవ‌డం ద్వారా ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నడుమ సామాజిక సామ‌ర‌స్యం ఫ‌రిడ‌విల్లుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News