వీఆర్ ఏ లతో కేటీఆర్ చర్చలు!
వీఆర్ ఏ ల సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ రోజు వీఆర్ ఏ జేఏసీ నాయకులతో ఆయన చర్చలు జరిపారు.
Advertisement
పేస్కేలు, ఉద్యోగ క్రమబద్దీకరణ తదితర డిమాండ్లతో గత 58 రోజులుగా సమ్మె చేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ ఎ) తో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వీఆర్ ఎ జేఏసీ నాయకులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీఆర్ ఎ లకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. వీఆర్ ఎ లు ప్రభుత్వంలో భాగమని, వారి సమస్యలు తమ సమస్యలుగానే చూస్తామని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వీఆర్ ఎ ల సమస్యల పట్ల చిత్తశుద్దితో ఉన్నారని, సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆదేశాలిచ్చారని కేటీఆర్ తెలిపారు. వీఆర్ ఎ లు వెంటనే సమ్మె విరమించాలని కేటీఆర్ కోరారు.
Advertisement