ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్

లంచ్ తర్వాత పిటిషన్ విచారించాలని కోరిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్

Advertisement
Update:2024-12-20 11:23 IST

 ఫార్ములా ఈ - రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో దీనిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ - రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసుపై క్వాష్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరఫు లాయర్లు జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ తర్వాత పిటిషన్ విచారించాలని  కోరారు.  అయితే దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.ఏసీబీ కేసు దీని పరిధిలోకి రాదన్నారు. దీంతో సీజే బెంచ్ కు వెళ్లాలని జస్టిస్ శ్రవణ్ కుమార్ సూచించారు. దీంతో కేటీఆర్ తరఫు లాయర్లు సీజే ముందు మెన్షన్ చేశారు. రిజిస్ట్రీకి వెళ్లాలని కేటీఆర్ తరఫు లాయర్లకు సీజే సూచించారు.

మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ చిట్ చాట్ లో మాట్లాడారు. పొన్నం మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదన్నారు. ప్రభుత్వం కేసుపై ముందుకు వెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటమన్నారు. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. హెచ్ఎండీఏ కు ఆ మేరకు స్వతంత్రత ఉన్నది. ఫార్ములా - ఈ కార్ రేస్ కేసులో కొందరు తప్పుదోవపట్టిస్తున్నారు. ముఖ్యమంత్రా.. మంత్రులా.. తప్పుదోవ పట్టిస్తున్నదెవరో తెలియాలన్నారు. 

ఓఆర్ఆర్ లీజు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై స్పందించారు. టీఓటీ పద్ధతి దేశంలో ఇప్పటికే అమల్లో ఉందన్నారు. ఓఆర్ఆర్ లీజు డబ్బు రైతు రుణమాఫీకి వాడాము. అప్పటికే కేబినెట్ సబ్ కమిటీ... ఓఆర్ఆర్ లీజుకు సూచించిందన్నారు. నేషనల్ హైవే సంస్థ తరహాలోనే ఓఆర్ఆర్ లీజుకు ఇచ్చామని స్పష్టం చేశారు. అవినీతి జరిగితే ఇంకా ఆ ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. గతంలో రేవంత్ రెడ్డి ఆరోపణలపై హెచ్ ఎండీ ఏ పరువు నష్టం కేసు వేసిందని ఇప్పటికీ ఆ కేసు అలాగే ఉందన్నారు. సింగిల్ జడ్జితో విచారణ చేయించకపోతే కక్ష సాధింపు అనుకుంటారు. కోకాపేట భూములపై రూ. 10 వేల కోట్ల స్కామ్ అంటున్నారు. స్కామ్ అయితే కోకాపేట భూముల అమ్మకం కూడా రద్దు చేయాలని కేటీ ఆర్ డిమాండ్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News