ఆల్ ది బెస్ట్ చెబుతూనే టార్గెట్ ఫిక్స్ చేసిన కేటీఆర్

రాజకీయాలను పక్కనపెడితే తెలంగాణ ఫస్ట్ అనేది తమ విధానం అని తేల్చి చెప్పారు కేటీఆర్. ఈ విధానాన్ని కాంగ్రెస్ కూడా కొనసాగించాలన్నారు.

Advertisement
Update:2024-08-04 12:31 IST

సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లింది. ఈ పర్యటన గురించి ఎక్కడ ఏ వార్త వచ్చినా పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా అనే మాట వినపడుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికర ట్వీట్ వేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్లిన పెద్ద టీమ్ కి ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్.


గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో ఎన్ని విదేశీ కంపెనీలు తెలంగాణకు వచ్చాయి, ఎంత పెట్టుబడులు పెట్టాయి, ఎంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు కేటీఆర్. తమ ప్రభుత్వ హయాంలో 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయన్నారాయన. ప్రైవేట్ రంగంలో 24 లక్షలమందికి పైగా ఉద్యోగాలు లభించాయని చెప్పారు. TS-IPASS వంటి వినూత్న విధానాలతో తాము తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా మార్చామని గుర్తు చేశారు. భౌతిక, సామాజిక వనరులు సమకూర్చడమే కాకుండా, మౌలిక సదుపాయాల కల్పనతో తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించామన్నారు. తమ విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు కేటీఆర్.

రాజకీయాలను పక్కనపెడితే తెలంగాణ ఫస్ట్ అనేది తమ విధానం అని తేల్చి చెప్పారు కేటీఆర్. ఈ విధానాన్ని కాంగ్రెస్ కూడా కొనసాగించాలన్నారు. తమ హయాంలో తీసుకొచ్చిన కంపెనీలు విస్తరణకు ప్రాధాన్యమివ్వడం సంతోషకరమైన విషయం అన్నారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తీసుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. 

Tags:    
Advertisement

Similar News