సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దే
బీఆర్ఎస్ అభ్యర్థిని నాగజ్యోతిని గెలిపిస్తే ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు కృషి చేస్తామన్నారు.
ములుగులో బీఆర్ఎస్ జెండా ఎగరడం 100 శాతం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే ఎలా వస్తాయన్నారు. కాంగ్రెస్ వాళ్లకు ఓటేసి పని కావాలంటే కుదరదన్నారు. 2018లో ములుగును జిల్లా చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చి చూపించామన్నారు. ములుగుకు మెడికల్ కాలేజీ ఇచ్చామని గుర్తుచేశారు కేటీఆర్. సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు కేటీఆర్.
అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు కేటీఆర్. జనవరిలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు. దొడ్డు బియ్యంను రూ.15కు కిలో అమ్ముకుంటున్నారన్న కేటీఆర్.. అన్నపూర్ణ స్కీమ్ కింద ఇకపై సన్న బియ్యం ఇస్తామన్నారు. రైతు బీమా తరహాలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా తీసుకువస్తామన్నారు. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు కేటీఆర్.
బీఆర్ఎస్ అభ్యర్థిని నాగజ్యోతిని గెలిపిస్తే ఏటూరు నాగారంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కమలాపూర్ బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్దరణకు కృషి చేస్తామన్నారు. గోదావరి వరదలను తట్టుకునేలా కరకట్ట నిర్మాణం, ములుగులో స్పోర్ట్స్ కాంప్లెక్స్, కొండాయి బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. ముసలమ్మ వాగు, నర్సింహ వాగు ప్రాజెక్టులను ఆధునీకరిస్తామన్నారు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు.