వైద్య పరికరాలపై జిఎస్‌టిని తగ్గించాలని కేంద్రానికి కేటీఆర్ లేఖ!

భారతదేశంలో విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు పథకాలను ప్రవేశపెట్టాలని మొబైళ్ళు, ఎక్స్-రే మెషీన్‌లకు చేస్తున్నట్లుగా అన్ని వైద్య పరికరాలపై దశలవారీగా దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దేశీయ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరాన్నిఆయన నొక్కిచెప్పారు.

Advertisement
Update:2023-03-15 07:19 IST

వైద్య పరికరాలపై జీఎస్టీని 12 శాతానికి, డయాగ్నోస్టిక్స్‌పై ప్రస్తుతం ఉన్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు.

భారతదేశంలో విడిభాగాల తయారీని ప్రోత్సహించేందుకు పథకాలను ప్రవేశపెట్టాలని మొబైళ్ళు, ఎక్స్-రే మెషీన్‌లకు చేస్తున్నట్లుగా అన్ని వైద్య పరికరాలపై దశలవారీగా దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దేశీయ కంపెనీలను ప్రోత్సహించాల్సిన అవసరాన్నిఆయన నొక్కిచెప్పారు.

దేశంలో వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ఆయన తన లేఖలో లేవనెత్తారు.

హైదరాబాద్‌లోని మెడికల్ డివైజెస్ పార్క్‌లో అధునాతన పరికరాలు, యంత్రాలతో కూడిన మెడికల్ ఇమేజింగ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని కేటీఆర్ తెలిపారు. 15 శాతం కంటే ఎక్కువ కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (CAGR) తో అభివృద్ధి చెందుతున్న ఈ పరిశ్రమకు వైద్య పరికరాలను పరీక్షించడానికి ల్యాబ్‌ల సంఖ్య సరిపోనందున దేశంలో పరీక్షా సౌకర్యాలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బయోఏషియా 20వ వార్షికోత్సవం హైదరాబాద్ లో విజయవంతంగా ముగిసిందని, ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య పరికరాలపై రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించామని, ఈ సందర్భంగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారులు, అసోసియేషన్‌ ప్రతినిధులు తమ సమస్యలను ప్రస్తావించి సమర్థవంతమైన చర్యలను సూచించారని కేటీఆర్ పేర్కొన్నారు. వైద్య పరికరాల పరిశ్రమ. లేవనెత్తిన సమస్య‌లను ఉదహరిస్తూ, ప్రస్తుతం కస్టమ్ డ్యూటీకి అదనంగా, వైద్య పరికరాల విడిభాగాలపై GST కూడా ప‌రికరాల ధర కంటే ఎక్కువగా ఉందని తెలిపారు కేటీఆర్. వైద్య పరికరాలు విలాసవంతమైన వస్తువులు కావు . ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి పరికరాలు, డయాగ్నస్టిక్స్ కీలకమని గుర్తించడం చాలా ముఖ్యం అని ఆయన తన లేఖలో అన్నారు.

''దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి 'మేక్ ఇన్ ఇండియా'ను ప్రోత్సహించాలి, దిగుమతి సుంకం లాంటి అడ్డంకులను కేంద్ర ప్రభుత్వం సమీక్షించి, సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైంది, ”అని ఆయన అన్నారు.

Tags:    
Advertisement

Similar News