అబద్దాల బీజేపీని బట్టలిప్పిన క్రిషాంక్.. సీడీ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
కొన్నాళ్లుగా '100 Lies of BJP' (బీజేపీ 100 అబద్దాలు) పేరిట క్రిషాంక్ సోషల్ మీడియాలో కేంద్రంలోని బీజేపీ నెరవేర్చని హామీలను బహిర్గతం చేస్తూ వచ్చారు.
తెలంగాణ రాష్ట్రానికి భారీగా నిధులు ఇచ్చామని కేంద్రంలోని బీజేపీ చెబుతూ వస్తోంది. ఇటీవల కాళేశ్వరం విషయంలో కూడా పార్లమెంట్ సాక్షిగా రూ.86 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎంపీలు కూడా ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు నిధులు అడిగినా రూపాయి కూడా ఇవ్వలేదని సాక్షాత్తు సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో చట్టంలో ఇచ్చిన హామీలనే కాకుండా.. బీజేపీ నాయకులు ఇచ్చిన ప్రామిసెస్‌ను కూడా అమలు చేయలేదు. ఇలాంటి 100 ప్రామిసెస్‌ను కేంద్రం అమలు చేయక పోగా.. అబద్దాలు చెబుతోంది. ఈ అబద్దాల వెనక నిజాలను ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంక్ బయటకు తీసుకొచ్చారు.
కొన్నాళ్లుగా '100 Lies of BJP' (బీజేపీ 100 అబద్దాలు) పేరిట క్రిషాంక్ సోషల్ మీడియాలో కేంద్రంలోని బీజేపీ నెరవేర్చని హామీలను బహిర్గతం చేస్తూ వచ్చారు. తాజాగా అన్ని అబద్దాలు, దాని వెనుక ఉన్న నిజాలను సీడీ రూపంలో తీసుకొని వచ్చారు. దీన్ని రాష్ట్రం మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం విడుదల చేశారు.
బీజేపీ ఇచ్చిన వాగ్గానాలను నెరవేర్చడంలో ఎలా విఫమైందో క్రిషాంక్ గత 100 రోజులుగా ఆయన సోషల్ మీడియాలో వివరించారు. ఉద్యోగ కల్పన, ద్రవ్యోల్బణం, జీఎస్టీ, ప్రతీ ఇంటికి ఇంటర్నెట్, స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సీసీఐ, వాల్మికీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇలాంటి వాగ్దానాలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని క్రిషాంక్ తన 100 రోజుల క్యాంపెయిన్‌లో వివరించారు. కేవలం బీజేపీ జాతీయ నాయకులే కాకుండా.. రాష్ట్ర నాయకత్వం ఎలా విఫలమైందో పూర్తిగా వివరించారు.