కాంగ్రెస్ నుంచి కోమటి రెడ్డిని సస్పెండ్ చేయాలి...కొండా సురేఖ డిమాండ్

ఈ రోజు గాంధీ భవన్ లో పీసీసీ విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడుతూ, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Update:2023-01-21 15:50 IST

అనేక వర్గాలు, నేతల మధ్య వైరుద్యాలతో రోజుకో గొడవగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఏఐసీసీ ప్రతినిధి మాణిక్ రావు ఠాక్రే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే... గాంధీభ‌వన్ గడపతొక్కబోనని ప్రతిన బూనిన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిన్న గాంధీభవన్ కు వచ్చి ఠాక్రేతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. కడుపులో కత్తులుపెట్టికొని తిరిగిన రేవంత్, కోమటి రెడ్డిలు ఆలింగనం చేసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. ఇక వర్గాలన్నీ ఏకమవుతాయని కాంగ్రెస్ పార్టీ ఏకంగా సాగుతుందని కార్యకర్తలు ఆనందపడ్డారు. అయితే ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆనందాన్ని ఒక్క రోజు కూడా మిగల్చలేదు. ఈ రోజు జరిగిన సమావేశంలో, కొండా సురేఖ మాట్లాడుతూ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.

ఈ రోజు గాంధీ భవన్ లో పీసీసీ విస్త్రుత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ మాట్లాడుతూ, అందరం ఏకంగా పని చేస్తేనే గెలుస్తామన్నారు.గతంలో నాయకుల మధ్య గొడవల వల్లనే ఓడిపోయామన్నారు. పార్టీకి నష్టం చేసేవాళ్ళను తేలిగ్గా తీసుకోవద్దని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సురేఖ మాటలకు అడ్డు తగిలిన రేవంత్ రెడ్డి వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడవద్దని, అలాంటి విషయాలను మాణిక్ రావు ఠాక్రేతో మాట్లాడాలని సూచించారు. కాగా ఈ విషయంపై కోమటి రెడ్డి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News