కేసీఆర్ పీఎం కావాలి.. కేటీఆర్ సీఎం కావాలి

కోడి, మందుసీసా పంచి పెట్టిన టీఆర్ఎస్ నేత

Advertisement
Update:2022-10-04 16:32 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న విషయం తెలిసిందే. ఇందుకు దసరా(రేపే) ముహూర్తంగా పెట్టుకున్నారు కూడా.. సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ విధానాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా.. జాతీయ పార్టీగా టీఆర్ఎస్ రాణించడం కష్టమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

మరోవైపు జాతీయ పార్టీపై ఇప్పటికే టీఆర్ఎస్ లో సంబురాలు మొదలయ్యాయి. ఎక్కడికక్కడ నేతలు సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ నినదిస్తున్నారు. ఇదిలా ఉంటే వరంగల్ కు చెందిన ఓ టీఆర్ఎస్ నేత కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు.

కేసీఆర్ పీఎం కావాలి.. కేటీఆర్ సీఎం కావాలంటూ సదరు నేత వరంగల్ పట్టణంలో దాదాపు 300 మంది హమాలీలకు ఓ క్వాటర్ సీసా.. కోడిని పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాణించి తీరుతుందని సదరు నేత అంటున్నారు. కాగా ఆయన చేసిన పనికి నెటిజన్లు కాస్త నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. జాతీయ పార్టీ పెడితే విధానాలు, చేయబోయే పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి గానీ.. కోడి, మద్యం పంపిణీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News