దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు.

Advertisement
Update:2024-10-29 15:37 IST

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆయన పర్యటించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించేది లేదని మంత్రి తెలిపారు. వేబ్రిడ్జి కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్‌ చేయిస్తామని పొంగులేటి హెచ్చరించారు. తెలంగాణలో ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణ మాఫీ చేశామని అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. డిసెంబర్‌లోపే రూ.13 వేల కోట్ల రుణమాఫీ అమలు చేస్తాం.అర్హత ఉన్న పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను దీపావళి కానుకగా ఇవ్వబోతున్నామన్నారు. నాడు దివగంత నేత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఇందిరమ్మ ఇళ్లు కట్టించారో ఇప్పుడూ అలాగే ఇస్తామన్నారు.

సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పాం.. ఇవ్వబోతున్నామన్నారు. ధాన్యంలో తేమ శాతం కోసం ఎండబెట్టుకుని తీసుకెళ్లాలి. సీసీఐ నిబంధనల ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలి. కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలి. అన్నదాత ఫిర్యాదు చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటాం. అన్నదాతలకు ఎక్కడా నష్టం కలగకుండా చూడాలి. వారి అవసరాలు, కష్టాలు తీర్చాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉంది’’ అని పొంగులేటి అన్నారు.

Tags:    
Advertisement

Similar News