ప్రభుత్వ ఉద్యోగుల అంత్యక్రియల మొత్తం పెంపు
ప్రభుత్య ఉద్యోగుల అంత్యక్రియలు మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
Advertisement
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్య ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియలు చార్జీల మొత్తంను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలు ఉండగా.. దానిని రూ.30 వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో కూడా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా మరణాంతరం ఆర్థిక సాయం ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలబడుతోంది.
Advertisement