దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయి.... పొంగులేటికి మంత్రి పువ్వాడ సవాల్
పార్టీలో లేకుంటే పొంగులేటి అయినా, ఇంకెవరికైనా ప్రజల్లో విలువ ఉండదని అన్నారు అజయ్. వ్యక్తులపై బీఆరెస్ ఆధారపడదని, ''చక్కగా ఉంటే పార్టీలో ఉండండి లేకుంటే రాజినామా చేసి వెళ్ళిపోండి'' అని అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత కాలంగా ఖమ్మం జిల్లా బీఆరెస్ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేపట్టిన బీఆరెస్ వ్యతిరేక కార్యక్రమాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఆయన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన 20 మంది బీఆరెస్ నాయకులను పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పొంగులేటి తనను సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరాడు.
పొంగులేటి సవాల్ నేపథ్యంలో ఈ రోజు మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ. శ్రీనివాస్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఆయన పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
పార్టీలో లేకుంటే పొంగులేటి అయినా, ఇంకెవరికైనా ప్రజల్లో విలువ ఉండదని అన్నారు అజయ్. వ్యక్తులపై బీఆరెస్ ఆధారపడదని, ''చక్కగా ఉంటే పార్టీలో ఉండండి లేకుంటే రాజినామా చేసి వెళ్ళిపోండి'' అని అజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బీ ఫార్మ్ మీద పోటీ చేసిన వారు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తూ ఉంటే ఏ పార్టీ అయినా చూస్తూ ఎందుకు ఊరుకుంటుందని అజయ్ ప్రశ్నించారు. వైరాలో బీఆరెస్ అభ్యర్థి ఉండగానే మరో అభ్యర్థిని ఎలా ప్రకటిస్తావంటూ పొంగులేటిని నిలదీశారు అజయ్.