కేసీఆర్ మనవడిపై ప్రశంసల వర్షం.. ఎందుకంటే..?

తండ్రికి తగ్గ తనయుడు అంటూ హిమాన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update:2023-07-10 20:38 IST

సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడు అంటూ హిమాన్షుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు. కేటీఆర్ తన సొంత ఖర్చుతో ఇటీవల కోనాపూర్ స్కూల్ ని అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు హిమాన్షు కూడా తండ్రి బాటలోనే ఓ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. కోటి రూపాయల నిధులు ఖర్చు చేసి ఆ స్కూల్ రూపు రేఖలు మార్చేశారు.

గచ్చిబౌలి కేశవనగర్‌ లో ఉన్న ప్రాథమిక పాఠశాలను హిమాన్షు గతంలో సందర్శించారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ స్కూల్ ని దత్తత తీసుకున్నారు. హిమాన్షు తన స్కూల్ లో క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (CAS) ప్రెసిడెంట్ గా ఉన్నారు. CAS ప్రెసిడెంట్ గా నిధులు సేకరించారు. అలా సేకరించిన నిధులతో కేశవనగర్ పాఠశాల రూపు రేఖలు మార్చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు హిమాన్షు.


హిమాన్షు సహకారంతో కేశవనగర్ స్కూల్ లో స్కూల్ లో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ రూమ్, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు పాఠశాల హెడ్మాస్టర్ రాములు యాదవ్. ఆయనకు తమ విద్యార్థులెంతో రుపణపడి ఉంటామని చెప్పారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈనెల 12న నూతనంగా అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. కేటీఆర్ లాగే హిమాన్షు కూడా ప్రభుత్వ స్కూల్ ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News