హైదరాబాద్‌లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకొచ్చిన శవం

భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Advertisement
Update:2024-08-20 10:45 IST

గ్రేటర్‌ హైదరాబాద్ ప‌రిధిలో వర్షం దంచికొట్టింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా పలు ప్రాంతాల్లో వర్షం కుమ్మరించింది. కేవలం 3 గంటల్లోనే 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో హైదరాబాద్‌లోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. పార్సిగుట్ట, సనత్‌నగర్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. పార్సిగుట్టలోని నాలాలోకి గుర్తు తెలియని శవం కొట్టుకువచ్చింది.

భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్‌కు హై అలర్ట్ జారీచేసింది వాతావరణశాఖ. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల డీఈవోలు ఆదేశాలు జారీచేశారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్న‌ట్లు వాతావరణశాఖ తెలిపింది.

Tags:    
Advertisement

Similar News