ట్విట్టర్ లో 'ఆరోగ్య తెలంగాణ' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన నేపథ్యంలో ట్విట్టర్ లో 'ఆరోగ్య తెలంగాణ' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం అది నెంబర్1 లో ఉన్నది.
ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 8 మెడికల్ కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో ట్విట్టర్ లో 'ఆరోగ్య తెలంగాణ' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయ్యింది. ప్రస్తుతం ఆ హ్యాష్ ట్యాగ్ నెంబర్ 1 గా కొనసాగుతోంది.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కోర్సు మొదటి సంవత్సరం తరగతులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో వైద్య రంగంపై తెలంగాణా ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్దను నెటిజనులు ప్రశంసిస్తున్నారు.
''తెలంగాణలో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. వైద్య విద్య & ఆరోగ్య రంగంలో తెలంగాణకు ఇది గొప్ప రోజు
ఉమ్మడి APలో 57 సంవత్సరాలలో 3 వైద్య కళాశాలలు స్థాపిస్తే; తెలంగాణ ప్రభుత్వం కేవలం 8 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.'' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
''మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాట ప్రకారం నడుచుకుంటారని మరోసారి రుజువు చేశారు.
ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ ఇవాళ వివిధ జిల్లాల్లో 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు.'' అని టీఆరెస్ నేత క్రిషాంక్ చేసిన్ ట్వీట్ ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు.
''2024 నాటికి దేశంలోని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని BJP తన ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపింది. కానీ ఇప్పటి వరకు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేయలేదు.
కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో 8 సంవత్సరాలలో 12 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది.'' అని ఏనుగు భరత్ రెడ్డి అనే మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.