మీరు మాకు పదవులిచ్చేదేంటి..? మేమే గడ్డిపోచల్లా త్యజించాం

ఎమ్మెల్యే కాకుండానే తనకు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ టైమ్ లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిందే అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు హరీష్ రావు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తామే కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామని చెప్పారు.

Advertisement
Update:2023-12-16 12:16 IST

"ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు. ప్రజలకిచ్చిన గ్యారెంటీలపై ముందు దృష్టిపెట్టండి. మా మీద బురదజల్లడం మానండి, పాలనపై దృష్టిపెట్టండి." అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తమకు పదవులిచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, తమకు వారు పదవులివ్వడమేంటని.. తామే పదవుల్ని గడ్డిపోచల్లా త్యజించామని చెప్పారు. ఎమ్మెల్యే కాకుండానే తనకు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ టైమ్ లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చిందే అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు హరీష్ రావు. తాము పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, తామే కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టామని చెప్పారు.


Full View

కేసీఆర్ చరిత్ర తెలుసా..?

కేసీఆర్ ని ఎంపీ చేశామని రేవంత్ రెడ్డి అంటున్నారని, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ ఏర్పాటుని పొందుపరిస్తేనే తాను మంత్రి పదవి చేపడతానని కండిషన్ పెట్టిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు హరీష్ రావు. దేశ చరిత్రలోనే పదవులను గడ్డిపోచల్లా వదిలేసిన ఘనత కేసీఆర్, అప్పటి టీఆర్ఎస్ నేతలకే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీలో ప్రస్థానం ప్రారంభించి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారని, రేపు ఎక్కడుంటారో తెలియదని ఎద్దేవా చేశారు. పార్టీలు మారిన చరిత్ర వారిదేనన్నారు హరీష్ రావు.

వైఎస్సార్ హయాంలో మంత్రి పదవుల్ని తాము 14 నెలలకే వదిలిపెట్టామని చెప్పారు హరీష్ రావు. అక్రమంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి తెలంగాణకు దక్కాల్సిన జలాలను రాయలసీమకు తీసుకెళ్లడాన్నినిరసిస్తూ తాము రాజీనామా చేశామని, పులిచింతల ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా రాజీనామా చేశామని, 610 జీవో అమలులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించామని, నక్సలైట్లతో చర్చలు జరిపి ఫేక్ ఎన్ కౌంటర్లు చేసినందుకు వ్యతిరేకంగా తాము అప్పట్లో రాజీనామా చేశామని గుర్తు చేశారు హరీష్ రావు. 

Tags:    
Advertisement

Similar News