రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదు : హరీశ్ రావు

తెలంగాణ మంత్రి కొండా వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

Advertisement
Update:2024-10-02 20:28 IST

తెలంగాణ మంత్రి కొండా వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తక్షణమే మాజీ మంత్రి కేటీఆర్‌కు సినీ పరిశ్రమలో ఉన్న మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్టుతో జతపరిచారు. కొండా సురేఖపై జరిగిన ట్రోలింగ్‌ను ఒక మహిళగా తాము ఖండించామని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

కానీ బాధ్యతగల మంత్రిగా దిగజారి ఆమె మాట్లాడటం సరికాదన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి అన్నారు. ఒక మహిళగా మరో మహిళను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. తనపై ఎవరో ట్రోల్ చేస్తే కేటీఆర్‌కు ఆపాదించడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమను కామెంట్ చేసిన విషయం కొండా సురేఖ మరిచారా? అని ప్రశ్నించారు. కేటీఆర్ కారణంగానే నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారని పేర్కొంది. కేటీఆర్ వల్లనే కొంత మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారని మంత్రి కొండా సురేఖ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News