సింగరేణి కార్మికులకు గుడ్‌ న్యూస్‌.. 32 శాతం బోనస్‌

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 11వ వేజ్‌ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు ఖాతాలో జమ చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Update:2023-09-26 17:58 IST

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2022 -23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభాల వాటాలో 32 శాతం ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి నర్సింగ రావు ఉత్తర్వుల కాపీ విడుదల చేశారు. ఇందులో భాగంగా సింగరేణి ఉద్యోగులకు 700 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్‌ ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ఓకే చెప్పింది.

మరోవైపు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 11వ వేజ్‌ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లు ఖాతాలో జమ చేయడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఒకేసారి చెల్లించడం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి అని తెలిపారు.


ఇన్‌కమ్‌ టాక్స్‌, CMPFలో జమ చేయాల్సిన మొత్తం మినహా మిగిలిన మొత్తాన్ని ఖాతాల్లో జమ చేశారు. దసరా పండుగలోపు లాభాల వాటాతో పాటు దీపావళి బోనస్‌ను చెల్లించడానికి సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.700 కోట్ల లాభాల బోనస్‌ను దసరా లోపు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌ బలరాం. దీపావళి బోనస్‌ PLR ముందుగానే చెల్లించేందుకు రెడీగా ఉన్నామని.. బకాయులు, బోనస్‌ చెల్లింపులపై కొందరు అనవసర అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News