యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు : కిషన్ రెడ్డి

ఘట్ కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్‌తో కలిసి తెలంగాణ ఎంపీలతో రైల్ నిలయంలో సమావేశం అయ్యారు.

Advertisement
Update:2024-10-24 18:54 IST

ఘట్ కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్‌తో తెలంగాణ ఎంపీల సమావేశం అనంతరం రైల్ నిలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 5 వందే భారత్‌ రైళ్లు ఉన్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మరిన్ని తీసుకొస్తామన్నారు.

రూ.720 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పనులు చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తి చేస్తామన్నారు. యాదాద్రి ఎంఎంటీఎస్‌కు రూ.650 కోట్లు అవసరం అవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సేవలను పొడిగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీలు సురేష్‌రెడ్డి, కడియం కావ్య, డీకే అరుణ, రఘునందన్‌రావు పాల్గొన్నారు. పలు సమస్యలను వారు జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని ఎంపీ రఘునందన్‌ రావు కోరారు. కొల్లూరు, ఈదుల నాగులపల్లి రైల్వే బ్రిడ్జిని అభివృద్ధి చేయాలన్నారు. జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాస్‌లను పునరుద్ధరించాలని కోరారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే లైన్‌ పూర్తి చేయాలన్నారు.

Tags:    
Advertisement

Similar News