రెండున్నర గంటలైనా కానరాని డీఎస్సీ రిజల్ట్స్‌

ఇంటర్నెట్‌ సెంటర్లు వద్ద నిరుద్యోగుల పడిగాపులు.. ఫోన్‌ లతో కుస్తీ

Advertisement
Update:2024-09-30 14:41 IST

టీచర్‌ పోస్టుల భర్తీని 65 రోజుల్లోనే పూర్తి చేస్తున్నాం.. ఇదీ తమ చిత్తశుద్ధిని అని సీఎం ప్రకటించుడే తప్ప డీఎస్సీ రిజల్ట్‌ చూసే అవకాశం మాత్రం నిరుద్యోగులకు కలుగలేదు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి విద్యాశాఖ మంత్రి హోదాలో డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. సీఎం అధికారికంగా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆశగా రిజల్ట్స్‌ కోసం నిరుద్యోగులు సెర్చ్‌ చేయడం మొదలు పెట్టారు. సొంత మొబైల్‌ ఫోన్‌ లలో రిజల్ట్స్‌ కనిపించకపోవడంతో ఇంటర్నెట్‌ సెంటర్లకు పరుగులు పెట్టారు. అక్కడికి వెళ్లినా సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ''This site can’t be reached'' అనే వస్తోంది. రెండున్నర గంటలుగా రిజల్ట్స్‌ కోసం డీఎస్సీ పరీక్ష రాసిన వాళ్లు నానా తంటాలు పడుతున్నారు. దేశంలో ఎక్కడా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం నిరుద్యోగుల నుంచి రూ. వెయ్యి ఫీజు వసూలు చేసిన రాష్ట్రాలు లేవు. రూ.వెయ్యి ఫీజు వసూలు చేసిన తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఫలితాలు ప్రకటించినా వెబ్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. పోనీ తమ సమస్యను చెప్పుకుందామని హెల్ప్​లైన్​ సపోర్ట్‌ నంబర్లు +91-9154114982/+91-6309998812 ఫోన్​ చేస్తే కనీస స్పందన లేదు. ముఖ్యమంత్రి ఆర్భాటంగా ఫలితాలు ప్రకటించామని చెప్పినా సాంకేతిక సమస్యలతో నిరుద్యోగులకు అగచాట్లు తప్పడం లేదు.

Tags:    
Advertisement

Similar News