మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

కావూరి హిల్స్‌ పార్క్‌ ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలిగిస్తున్నారు.

Advertisement
Update:2024-09-23 09:01 IST

హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నది. మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నది. కావూరి హిల్స్‌ పార్క్‌ ప్రాంతంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలిగిస్తున్నారు.ఉదయం నుంచి మాదాపూర్‌ కావూరి హిల్స్‌లో జీహెచ్‌ఎంసీ పార్క్‌లో నిర్మాణాలు చేపట్టారని స్పోర్ట్స్‌ అకాడమీపై కావూరి హిల్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అక్రమ షెడ్లను హైడ్రా కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలు తొలిగించి కావూరి హిల్స్‌ పార్కు పేరుతో బోర్డు ఏర్పాటు చేశారు.

పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్‌ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా తొలిగించారని ఆరోపించారు.కోర్టు ఆర్డన్‌ను ధిక్కరించే అధికారం హైడ్రాకు ఉన్నదా? ఉంటే చేసుకోమనండి. ఎందుకంటే కోర్టు తీర్పు ఇచ్చింది. తిరిగి తీర్పు ఇచ్చే వరకు దీని జోలికి ఎవరూ వెళ్లవద్దు. దీన్ని ప్లేగ్రౌండ్‌లా ఉంచమని కోర్టు చెప్పిందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. కోర్టు ఆర్డర్‌ను ధిక్కరించే అధికారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, హైడ్రా వారికి ఉన్నదా? అని ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్స్‌ను నోటీసు బోర్డులో పెట్టినప్పటికీ వాటన్నింటిని చింపేసి, కావూరి హిల్స్‌ వాళ్లు దౌర్జన్యం చేశారని ఆరోపించారు. హైడ్రా సామాన్యులకు ఉపయోగ పడుతుందా? అని నిలదీశారు. నోటీసులు ఉన్నప్పటికీ తాము ఈ విషయంపై పోరాడుతున్నామని షెడ్‌ నిర్వాహకులు చెబుతున్నారు.  

Tags:    
Advertisement

Similar News