దీక్షా దివస్.. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి భారీ అడ్వాంటేజ్

సరిగ్గా ఎన్నికల వేళ దీక్షా దివస్ నిర్వహించుకోవడం బీఆర్ఎస్ కి భారీ అడ్వాంటేజ్ అని చెప్పాలి. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్ గొప్పతనం.. వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ క్రూరత్వం.. రెండూ ప్రజలకు గుర్తొస్తాయి. తెలంగాణకు కాంగ్రెస్ విలన్, తెలంగాణకు కేసీఆరే హీరో అనే విషయాలు మళ్లీ చర్చకు వస్తాయి.

Advertisement
Update:2023-11-27 08:12 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు ఈనెల 28తో ముగుస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మైకులు మూగబోతాయి. 29న ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఆ రోజు కలిసొచ్చేరోజు. దీక్షా దివస్ గా గత 14ఏళ్లుగా పార్టీ సంబరాలు చేసుకుంటున్న రోజు నవంబర్ 29. ఈ ఏడాది కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా దీక్షా దివస్ ని ఘనంగా జరుపుకోబోతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. కేవలం తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ సానుభూతిపరులు, తెలంగాణవాదులు ఉన్న ప్రతిచోటా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

15 ఏళ్ల క్రితం నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు కేసీఆర్. కరీంనగర్‌ లో బయలుదేరి అలుగునూరు చౌరస్తా నుంచి ఖమ్మం జైలుకు పోయేదాకా.. అక్కడి నుంచి నిమ్స్‌ ఆస్పత్రికి వచ్చేదాకా.. మధ్యలో జరిగిన ఘట్టాలెన్నో అందరికీ గుర్తున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణించినా, ప్రాణాలకే ప్రమాదమని తెలిసినా, ఎందరో బతిమిలాడినా, ఆత్మగౌరవ విశ్వరూపం చూపించి, ఆ పట్టుదల లోంచి పార్లమెంట్‌లో ప్రకంపనలు పుట్టించిన ధీరత్వం కేసీఆర్‌ ది అని అన్నారు కేటీఆర్. కేసీఆర్‌ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా, తెలంగాణ జాతి విముక్తికి చిహ్నంగా ‘దీక్షా దివస్‌’ను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ నెల 29న దీక్షా దివస్‌ ను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబోతున్నట్టు తెలిపారు ఎన్నారై గ్లోబల్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009న నవంబర్‌ 29న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తుచేశారు. దీక్షాదీవస్‌ స్ఫూర్తిని, అమరుల త్యాగాలను, జ్ఞాపకాలను, పోరాటాలను స్మరించుకొంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు దీక్షా దివస్‌ ను నిర్వహిస్తారని చెప్పారు.

కేసీఆర్ హీరో.. కాంగ్రెస్ విలన్

సరిగ్గా ఎన్నికల వేళ దీక్షా దివస్ నిర్వహించుకోవడం బీఆర్ఎస్ కి భారీ అడ్వాంటేజ్ అని చెప్పాలి. కేసీఆర్ ఆమరణ దీక్ష ఎపిసోడ్ మళ్లీ ప్రజలకు గుర్తు చేస్తే.. కచ్చితంగా కాంగ్రెస్ పై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతాయి. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైన కేసీఆర్ గొప్పతనం.. వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారణమైన కాంగ్రెస్ క్రూరత్వం.. రెండూ ప్రజలకు గుర్తొస్తాయి. తెలంగాణకు కాంగ్రెస్ విలన్, తెలంగాణకు కేసీఆరే హీరో అనే విషయాలు మళ్లీ చర్చకు వస్తాయి. 

Tags:    
Advertisement

Similar News