సచివాలయ సిబ్బందికి సీఎస్‌వో అలర్ట్..సీఎం సెక్యూరిటీలో మార్పు

ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో ఉన్నతాధికారులు కీలక మార్పులు చేశారు. సీఎం నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2024-10-28 18:23 IST

తెలంగాణ సచివాలయ చుట్టూ చుట్టూ 2 కి.మీ వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉందని చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం సిబ్బంది కదలికలు, సోషల్‌ మీడియాపై నిఘా ఉందన్నారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ కావాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వం, పోలీసు శాఖకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు షేర్‌, లైక్‌ చేయొద్దన్నారు. తప్పు జరిగితే వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బెటాలియన్ కానిస్టేళ్లు నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తుండడంతో ఇంటెలిజెన్స్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో ఉన్నతాధికారులు కీలక మార్పులు చేశారు. సీఎం నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News