ఈయన జయప్రకాశ్ రెడ్డా? గుర్తు పట్టడం కష్టమే..!

తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి కలిగిన జగ్గారెడ్డి ఇవ్వాళ దర్శనానికి వెళ్లారు. అక్కడే తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Update:2022-11-11 18:14 IST

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి పేరు చెప్పగానే.. కొంచెం బట్ట తల, పొడవైన గడ్డం మీసాలు గుర్తుకు వస్తాయి. ఆయన గత కొన్నేళ్లుగా అదే ఆహార్యాన్ని మొయింటైన్ చేస్తూ వస్తున్నారు. కానీ, ఇవ్వాళ జగ్గారెడ్డి గుండుతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గడ్డం, మీసాలు తీసేసి.. గుండు కొట్టించుకున్న ఆ వ్యక్తి జగ్గారెడ్డి అంటే నమ్మడం చాలా కష్టమే. జగ్గారెడ్డిని గడ్డంతో చూసిన సొంత వ్యక్తులే ఆయనను గుర్తు పట్టడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు.

తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అత్యంత భక్తి కలిగిన జగ్గారెడ్డి ఇవ్వాళ దర్శనానికి వెళ్లారు. అక్కడే తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తిరుమలలో కొన్ని ఫొటోలు తీసుకున్నారు. జగ్గారెడ్డి కుటుంబంతో పాటు చేర్యాల మాజీ ఎంపీపీ ఆంజనేయులు, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ అంకాని ప్రవీణ్ కుమార్ మరి కొంత మంది అనుచరులతో తిరుపతికి వెళ్లి, దర్శనం చేసుకొన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. జగ్గారెడ్డి స్వయంగా వెల్లడించే వరకు ఆ ఫొటోలు ఆయనవే అని చాలా మంది నమ్మక పోవడం గమనార్హం.

ఇక ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. తన నియోజకవర్గం మీదుగానే పాదయాత్ర సాగడంతో దగ్గరుండి ఏర్పాట్లను చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్లపై విమర్శలు చేసే జగ్గారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తన భార్య నిర్మల రెడ్డి లేదా మరో నాయకుడిని కాంగ్రెస్ తరపున సంగారెడ్డిలో నిలబెట్టి.. తాను మాత్రం పార్లమెంటుకు వెళ్లాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే జగ్గారెడ్డి ఇటీవల రాహుల్ గాంధీ వద్ద విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే టికెట్ల విషయం పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు ఎన్నికల కమిటీ చూసుకుంటుదని చెప్పినట్లు సమాచారం. ఇక పాదయాత్ర తెలంగాణలో ముగియడంతో జగ్గారెడ్డి కుటుంబంతో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లినట్లు తెలుస్తున్నది.

Full View
Tags:    
Advertisement

Similar News