ముదిరాజ్‌ బిడ్డను మంత్రిని చేస్తా.. కానీ కండిషన్స్ అప్లై - రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క టికెట్ ఇవ్వలేదని.. ఆయన నిర్లక్ష్యానికి ముదిరాజ్‌లు నష్టపోయారని ఆరోపించారు

Advertisement
Update:2024-04-16 08:10 IST

నారాయణపేట జనజాతర సభలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్ సామాజికవర్గానికి కీలక హామీలు ఇచ్చారు. అయితే ఆ హామీలు నెరవేర్చడానికి కొన్ని కండీషన్స్ పెట్టారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. అప్పుడే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డకు మంత్రి పదవి ఇస్తానంటూ ఆఫర్ చేశారు.

రాష్ట్రంలో 10 శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఒక్క టికెట్ ఇవ్వలేదని.. ఆయన నిర్లక్ష్యానికి ముదిరాజ్‌లు నష్టపోయారని ఆరోపించారు రేవంత్. మెదక్‌ పార్లమెంట్‌ సీటును నీలం మధు ముదిరాజ్‌కు ఇచ్చామని.. కానీ కేసీఆర్ మాత్రం వెంకట్రామిరెడ్డికి ఇచ్చారన్నారు రేవంత్.

ఇక ముదిరాజ్‌లను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏకు మార్చే రిజర్వేషన్ల కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు రేవంత్. అది కూడా కేసీఆర్ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. కాంగ్రెస్‌ను 14 సీట్లలో గెలిపిస్తే మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు కొట్లాడుతామన్నారు రేవంత్. ముదిరాజ్‌లను బీసీ-ఏలోకి మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News