మరో రెండు గ్యారంటీల అమలు.. డేట్‌ ఫిక్స్

గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ పవర్ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలపై చర్చించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Advertisement
Update:2024-02-22 17:27 IST

రేవంత్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు హామీల అమలుకు సిద్ధమైంది. ఈ నెల 27 లేదా 29న రెండు పథకాలు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేబినెట్‌ సబ్‌కమిటీతో రివ్యూ నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు పథకాల అమలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

మహాలక్ష్మి స్కీమ్‌లో భాగంగా రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. ఇందులో భాగంగా రూ.500 ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానాన్ని అనుసరించాలని సీఎం రేవంత్ సూచించారు. ఇందుకోసం గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలన్నారు. సబ్సిడీ ఏ విధంగా చెల్లించాలనే అంశంపైనా చర్చించారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రూ.500కే సిలిండర్ అందించాలని సూచించారు.

గృహజ్యోతి గ్యారంటీలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ పవర్ స్కీమ్‌ను ప్రారంభించనున్నారు. పథకం అమలుకు సంబంధించి విధివిధానాలపై చర్చించారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Tags:    
Advertisement

Similar News