దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటేయండి.. హైకోర్టుకెళ్లిన బీఆర్ఎస్‌

బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేంద‌ర్‌ను ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా కూడా బ‌రిలోకి దింపింద‌ని పిటిష‌న్‌లో బీఆర్ఎస్ పేర్కొంది.

Advertisement
Update:2024-04-10 22:57 IST

బీఆర్ఎస్ టికెట్‌పై ఖైర‌తాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన త‌మ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌పై అనర్హ‌త వేటేయాల‌ని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్‌కు కూడా ఇప్ప‌టికే ఫిర్యాదు చేశామ‌ని చెప్పింది. స్పీక‌ర్ స్పందించ‌క‌పోవ‌డంతో హైకోర్టును ఆశ్ర‌యించినట్లు పిటిష‌న్‌లో వెల్ల‌డించింది. దానంపై అన‌ర్హ‌త వేటు వేసేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని కోరింది.

సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ

బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్‌లోకి వెళ్లిన దానం నాగేంద‌ర్‌ను ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా కూడా బ‌రిలోకి దింపింద‌ని పిటిష‌న్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. ఆయ‌న పార్టీ ఫిరాయించార‌న‌డానికి ఇంత‌కంటే ఆధారం అక్క‌ర్లేద‌ని చెప్పింది. అందువల్ల దీనిపై సాధ్య‌మైనంత త్వ‌రగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోర్టుకు విజ్ఞ‌ప్తి చేసింది. రంజాన్, వారాంత‌పు సెల‌వులు ముగిసిన త‌ర్వాత సోమ‌వారం ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశ ఉంది.

మిగిలిన‌వారిని ఏం చేస్తుందో?

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేంద‌ర్ ఇందులో మొద‌టివారు. ఇటీవ‌లే భద్రాచ‌లం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు కాంగ్రెస్‌లో చేరారు. అంత‌కు ముందు వారం మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హత వేటేయాల‌ని కోర్టుకెళ్లిన బీఆర్ఎస్ మిగిలిన ఇద్ద‌రిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో అనే చ‌ర్చ న‌డుస్తోంది.

Tags:    
Advertisement

Similar News