పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. కేసీఆర్‌ కీలక సూచన

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఎగరేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నమైన నేపథ్యంలో వేడుకలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు.

Advertisement
Update:2024-04-27 11:28 IST

బీఆర్ఎస్‌ (నాటి TRS) పార్టీ పెట్టి 23ఏళ్లు నిండిన సందర్భంగా పార్టీ నేతలకు, శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్. త్యాగాల పునాదుల మీద పుట్టిన పార్టీ.. ప్రత్యేక రాష్ట్ర సాధన గమ్యాన్ని ముద్దాడి, పదేండ్ల పాలనలో ప్రజలకు అద్భుతమైన ప్రగతి ఫలాలు అందించిందని తెలిపారు. దేశం గర్వించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ప్రపంచ రాజకీయ పార్టీల చరిత్రలో బీఆర్‌ఎస్‌ది ప్రత్యేక స్థానమన్నారు కేసీఆర్. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, మైలురాళ్లు అధిగమించడానికి బలమైన పునాదులు వేసింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు దన్నుగా నిలుస్తూ, ప్రజల ఆదరణ మరింతగా పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ పూనాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఎగరేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంతా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాల్లో నిమగ్నమైన నేపథ్యంలో వేడుకలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు కృషి చేసిందన్నారు కేటీఆర్. రానున్న రోజుల్లోనూ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుందన్నారు.

Tags:    
Advertisement

Similar News